కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైంది.

* మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.పలాస నియోజకవర్గంలోని మందస టౌన్ జంక్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న శిరీష పాలనలో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. వైన్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇవి అక్రమ వసూళ్లు కాదు… అక్క వసూళ్లు అని దుయ్యపట్టారు. పలాస నియోజకవర్గ ప్రజల జేబులను ఖాళీ చేస్తూ సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల వ్యవస్థకు ప్రజలు విసిగిపోయారని డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు. ప్రజల తరఫున ఈ అన్యాయాలను ప్రశ్నించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *