కోడుమూరు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు.

పయనించే సూర్యుడు మే 28 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, మహానాడు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ , కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ వారి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్తను గౌరవించడం తన బాధ్యత అని తెలిపారు.మహానాడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *