పయనించే సూర్యుడు మే 27 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) శివాయపల్లిలో పారదర్శకత కోసం సమాచార హక్కు ద్వారా దరఖాస్తు ప్రజాధనం వినియోగం ప్రజలకు తెలియాలని డిమాండ్ శివాయపల్లి గ్రామానికి వచ్చిన నిధులు వాటిని ఏఏ పనుల నిమిత్తం ఖర్చు చేశారనే పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతూ గ్రామ యువకులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు మంగళవారం గ్రామ యువకులు ముందుకు వచ్చి ఎంపీడీవో క్రాంతి కుమార్‌కు సమాచార హక్కు పత్రాన్ని అందజేశారు గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన నిధుల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని యువకులు తెలిపారు పనుల వారీగా చేసిన ఖర్చులు మంజూరైన పనులు పూర్తయిన పనులు పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు ఇవ్వాలని కోరారు ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాలని గ్రామ ప్రజలకు నిజమైన సమాచారం అందాలని యువకులు పేర్కొన్నారు గ్రామ అభివృద్ధి పేరుతో వచ్చిన నిధులు ఎలా వినియోగించారో ప్రజలకు తెలియజేయడం అధికారుల బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో కొంపల్లి ప్రవీణ్ కుక్కల అంజయ్య చిలకముక్కు మల్లేశం చిలకముక్కు వెంకటేశం దండు చంద్రయ్య దండు బేత్తయ్ కుక్కల శ్రీను చిలకముక్కు సత్యయ్య కుక్కల సాయిలు తదితరులు పాల్గొన్నారు.