గూడూరు 2వ పట్టణం లో 4వ క్లస్టర్, 18వ యూనిట్ సమావేశం

ఎండీ. అబ్దుల్ రహీమ్ 18వ యూనిట్ ఇంచార్జ్

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 4 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ప్రకారం, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు బుధవారం గూడూరు 2వ పట్టణం లో 4వ క్లస్టర్, 18వ యూనిట్ సమావేశం 18వ యూనిట్ ఇంచార్జ్ ఎండీ. అబ్దుల్ రహీమ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా గూడూరు నియోజకవర్గ పరిశీలకులు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి లక్ష్మి ప్రసన్న, 4వ క్లస్టర్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం లో గూడూరు 2వ పట్టణం వెంకటగిరి మినీ బైపాస్ రోడ్ జంక్షన్ నందు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ప్రతిష్టించాలని మరియు జూన్ 15 నుండి జులై 14వరకు జరిగే ఎస్.ఐ.ఆర్. సర్వే లో బి.ఎల్.ఒ. ల తో కలసి బి. ఎల్. ఎ. లు పాల్గొని ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరగకుండా దగ్గరుండి ఈ ప్రక్రియను పరిశీలించాలని యూనిట్ ఇంచార్జ్ ప్రతిపాదించగా, వార్డుల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు, బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వీనర్లు ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. ఈ సమావేశం లో 30, 32,33 వార్డుల అధ్యక్ష, కార్యదర్సులు, 08,21,22,23,24,25 బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వీనర్లు, ఎ. ఎం. సి. డైరెక్టర్, దేవస్థానాల కమిటీ మెంబర్లు మరియు ముఖ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *