పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 4 ఏ.ఏం.సి వైస్ చైర్మన్ సోమిశెట్టి చెంచురామయ్య ఆద్వర్యంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ , పుట్టినరోజు సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యులు ఏ.ఏం.సి వైస్ చైర్మన్ సోమిశెట్టి చెంచు రామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తు ప్రజల ఎమ్మెల్యే గా గుర్తింపు పొందారు అన్నారు. భవిష్యత్ లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుని వేడుకొంటున్నా మన్నారు.భవిష్యత్ లో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ,భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి సాయి కృష్ణ , వల్లంకొండ వెంకట సుబ్బయ్య, వల్లంకొండ సతీష్, వల్లంకొండ సురేష్ ,,కొండాభాస్కర్ ,తాలంకి సురేష్ ,సొల్లేటి ప్రసాద్ ,వాయుగుండ్లసుధాకర్ , గాదంశెట్టి రత్తయ్య, జోగిపర్తి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.