గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

"దౌల్తాబాద్: గోవిందపూర్ గ్రామసభ లో మాట్లాడుతున్న సర్పంచ్ ఉప్పల దాస్, స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం మహిపాల్"

పయనించే సూర్యుడు మే 7 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందపూర్ లో శనివారం గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ సమావేశంలో సర్పంచ్ ఉప్పల దాస్, స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం మైపాల్ మాట్లాడుతూ. గ్రామ పారిశుధ్యం, మొక్కల నాటకం, వ్యవసాయ పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభలో సూచించారు.గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పి.రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి, సీసీ సునీత, అంగన్‌వాడీ టీచర్ నికత్, ఆశా వర్కర్ లక్ష్మి, సీఏ సురేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *