ఉపాధ్యాయుడు కుటుంబానికి ఆర్థిక సాయం

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : మండలంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పేరవరంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఇటీవల పిడుగుపాటుకు గురై మరణించిన సుమర్ల సద్గుణరావు సంతాప సభ ఏలేశ్వరం మండల యుటిఎఫ్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ముందుగా మండల యుటిఎఫ్ తరుపున సద్గుణ రావు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యుటిఎఎఫ్ కుటుంబ సంక్షేమ పథకంలో భాగంగా కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు సిహెచ్.సూరిబాబు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర,జిల్లా కార్యదర్శి జట్ల సోమరాజు, మండల గౌరవ అధ్యక్షులు సుందరరావు,అధ్యక్షులు ఆదివిష్ణు, అసోసియేట్ అధ్యక్షుడు బి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి రవి,మండల విద్యాశాఖ అధికారి బి.అబ్బాయి, ప్రధానోపాధ్యాయులు మమత, భాగ్యజ్యోతి ఉపాధ్యాయులు ఎం.రాంబాబు, గణపతిరావు, బి.వి.మోహనరావు, విశ్వనాథ్, మూర్తి, వీర్రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *