పయనించే సూర్యుడు జూన్ 7 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభలు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పంపిణీ చేయడం జరిగింది.ఈరోజు 56 కుటుంబాలకి కాను రూ.18,04,242 లక్షల పంపిణీ చేశారు.గత 23 నెలల్లో ఇప్పటిదాకా 912 మంది లబ్ధిదారులకు రూ.2,30,92,018 కోట్లకు పైగా అందించారుఅనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక కొండంత అండగా నిలుస్తోందని టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పేర్కొన్నారు.ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ… సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోమంది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. అనారోగ్యం వల్ల ఆపదలో ఉన్న కుటుంబాలు ఆ సంక్షోభాన్ని అధిగమించి, తిరిగి సాధారణ జీవనాన్ని కొనసాగించేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులనుతొలగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సల కోసం డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్న వారికి ముందస్తుగా ఎల్ఓసీ కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం సహాయనిధి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు