డీ ఎస్సీ – నియామకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఎబివిపి డిమాండ్.

పయనించే సూర్యుడు జూన్ 7 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ 2025 ఉపాధ్యాయ పోస్టుల నియామకంలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ ) ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది . గత పది రోజులుగా కొంతమంది డీఎస్సీ పరీక్ష వ్రాసిన అభ్యర్థులు తమకు ఉపాధ్యాయ పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని, నియామకలలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని, మెరిట్ విద్యార్థుల కు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు సంబంధిత అధికారులు కలిసి వివరణ ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయం పై ఎబివిపి రాష్ట్ర కార్యసమితి సభ్యులు సి.వీరేష్ మాట్లాడుతూ గత వైఎస్ జగన్ నెత్రుత్వం లోని ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని దాదాపు 9 సంవత్సరాలు తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీగా చేపట్టిన 16వేల టీచర్ పోస్టులు భర్తీ తో నిరుద్యోగులు ఆనందపడుతున్న సమయంలో కొంతమంది డీఎస్సీ వ్రాసిన అభ్యర్థులు తమకు టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటల్లో 423 గాను 382 టీచర్లు భర్తీ నియామకాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని, మెరిట్ కి అన్యాయం జరిగిందని ఈ విషయంపై మేము కోర్టులో కేసులు వేసామని, రిజర్వేషన్లు పాటించలేదని జాతీయ ఎస్సీ,ఎస్టి కమిషన్ కు ఫిర్యాదు చేశామని ఆరోపిస్తూ ఆందోళనకు దిగడం గమనార్హం. దీనిపై నిజాలు నెగ్గు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఎంతైనా ఉందని ఏబీవీపీభావిస్తున్నది . ఇదే సమయంలో ఎటువంటి రాజకీయాల వత్తిడులు, ప్రలోబాలకు తావు లేకుండా రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా పారదర్శంగా వ్యవహరించే విధంగా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయలో నియామకం పై వచ్చే ఆరోపణలును గురించి నిజాలను తెలుసుకునేందుకు గాను అవసరమైన పక్షంలో సింగిల్ జడ్జి జడ్జిచే న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని ఏ బి వి పి డిమాండ్ చేస్తుంది. అదే విధంగా విచారణలో తప్పు జరిగిందని తేలితే విద్యా శాఖ మంత్రి భాద్యత వహించాలని కోరారు. అంతేకాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీఈ సందర్బంగా డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *