ఘనంగా మాజీ ఉపసర్పంచ్ రాజారెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ జూన్ 07 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): గోరంట్ల మేజర్ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ రాజారెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, శిష్య బృందం భక్తర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి నివాసంలో ఆయనకు శాలువా , పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు భక్తర్ మాట్లాడుతూ, మాజీ ఉపసర్పంచ్ రాజారెడ్డి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి, రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అలంకరించేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భక్తర్, నల్లబండ్ల శివ, ఓబుల కుమార్, అశోక్, కాలా భాష(చిచ్చా) ఆటో సోమశేఖర్ (ఏఐ క్రియేటర్) రహంతుల్లా వానవోలు శ్రీనివాసులు, మందలపల్లి మూర్తి, స్టూడియో శ్రీనాథ్, శ్రీకాంత్ దాదు. తదితరులు పాల్గొని రాజారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *