పయనించే సూర్యుడు మే 25, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జడ్చర్ల మాజీ శాసనసభ సభ్యులు ఎర్ర శేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయపల్లి 6 వ వార్డు సభ్యులు నరిగె శ్రీనివాసులు , నరిగె నర్సింలు పాల్గొని, ఎర్ర శేఖర్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.