ఘనంగా సుందరయ్య 41 వర్ధంతి

పయనించే సూర్యుడు న్యూస్ మే 20 బోధన్ :బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ బోధన్ మండల కమిటీ సిపిఎం పార్టీ ఆఫీసులో ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య41 వర్ధంతి కామ్రేడ్ బాలయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సభ్యులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడు జమీందార్ కుటుంబంలో జన్మించారు వారు రెడ్డిలైనప్పటికీ సుందర రామిరెడ్డి నుండి సుందరయ్యగా మార్చుకున్నారు తను ఉన్నత వర్గం వైపు కాకుండా పేద ప్రజలు కార్మికులు రైతులు అనగారి కులాల వైపున ఉన్నారు. స్వతంత్ర ఉద్యమంలో. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా మారి దక్షిణ భారతదేశంలో సిపిఐఎం పార్టీని నిర్మించినారు సిపిఎం పార్టీగా మొట్టమొదటి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా. సైకిల్పైనే ప్రయాణం చేసి ప్రజలకు దేశానికి ఒక ఉన్నతమైన నాయకుడిగా వ్యవహరించినారు. తన కుటుంబం తరఫున వచ్చిన 50 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ కార్యక్రమంలోనల్ల సాయిలు లింగం ప్రశాంత్ అశోక్ గంగారం పోశెట్టి రాములు సాయమ్మ పద్మ స్వరూప గంగవ్వ లక్ష్మి సావిత్రి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *