పయనించే సూర్యుడు న్యూస్:జులై/08:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామం లోని ఎం ఆర్ పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ, జన్మదినం మరియు ఎం ఆర్ పీ ఎస్ 32.వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అనంతగిరి గ్రామంలో ఎం ఆర్ పీ ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాదిగల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మంద కృష్ణ మాదిగ, నాయకత్వం లో ఎం ఆర్ పీ ఎస్. కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు , రిజర్వేషన్ ఫలాలు మాదిగలకే దక్కేలా కృషి చేసి, 9% రిజర్వేషన్ ను ఎం ఆర్ పీ ఎ. సాధించిన గొప్ప విజయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి గ్రామ ఎం ఆర్ పీ ఎ. గ్రామ కమిటీ, ఎం ఆర్ పీ ఎస్ సీనియర్ నాయకులు, కుల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.