పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.23.2026 రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గోపవరం గ్రామంలో అధిక ఉష్ణోగ్రతలు పెరగడం వలన గ్రామపంచాయతీ వారు ఏర్పాటు చేసి చలివేంద్రన్ని ప్రారంబించిన. ముసురుమిల్లి ఎంపీటీసీ కుంజం వంశీ మాట్లాడుతూ… వేసవిలో బాటసారులు, ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్ర ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆధార్ క్యాంపుని ప్రారంభించి. ఈ ఆధార్ క్యాంపు ద్వారా కొత్త ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్ లింకులు, చిరునామా మార్పులు, పలు రకాల ఆధార్ సేవలు చేయడం జరుగుతుందని. గ్రామపంచాయతీ ప్రజలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి సత్యప్రసాద్, పిసా ఉప అధ్యక్షులు చెల్లబ్బాయి, పిసా కార్యదర్శి బందం రవి, మాజీ సర్పంచ్ బాపిరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యులు తురసం వీర్యమ్మ, మహిళా పోలీస్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.