చిన్న పీరు తండాలో పేద కుటుంబానికి సర్పంచ్ మునిందర్ ఆర్థిక సాయం

​ పయనించే సూర్యుడు జులై 4 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలో చిన్న పీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ మునిందర్ తన ఉదారతను చాటుకున్నారు. తండాకు చెందిన రాత్లవత్ సరియ కుమార్తె వివాహానికి శనివారం ఆయన రూ. 5,000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పీఠ్య, ఎం. గోవింద్, బాలు, రాజు, వెంకటేష్, జాను తదితరులు పాల్గొని, వివాహం చేసుకోబోతున్న వధూవరులను ఆశీర్వదించారు. సర్పంచ్ చేసిన ఈ సహాయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *