పయనించే సూర్యుడు జూన్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జనసేన పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గురువారం జరిగిన కూటమి నేతల సమావేశంలో జనసేనకు ఒక సీటు, టీడీపీకి మూడు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, జనసేనకు దక్కిన రాజ్యసభ సీటుకు లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. మొదట్నుంచీ ప్రచారంలో ఉన్నట్టుగానే ఆయన పేరునే ఖరారు చేశారు.