జాతీయ ఎస్టి కమిషన్ చైర్మన్ కు వినతి.

* జాతీయ ఎస్టి కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యకి పెసా గ్రామ సభ ఉపాధ్యక్షులు,కార్యదర్శులు వినతి. * కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జూన్.05.2026 పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు గౌరవ వేతనం చెల్లించాలి.పెసా గ్రామసభ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఈరోజు విజయవాడలో జరిగిన పెసా గ్రామసభల స్టేట్ లెవెల్ రివ్యూ మీటింగ్ కి.ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యకి పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న. సమస్యల పై వినతి పత్రాలు అందజేశామని తెల్లం శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్ మాట్లాడుతూ….పోలవరం నిర్వాసితులకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని,పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులకు గౌరవ వేతనం చెల్లించాలని, పెసా గ్రామసభ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులకు ప్రోటోకాల్ విధానం పాటించాలని, పెసా గ్రామసభ ఆధ్వర్యంలో చేసిన తీర్మానాలకు సత్వరమే నిర్ణయాలు తీసుకోవాలని, నూతన పోలవరం జిల్లాలో రంపచోడవరం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు. చేయాలని, ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని,జిల్లా కోర్టు ఏర్పాటు. చేయాలని మొదలైన జిల్లా కార్యాలయాలు త్వరతిగతిన ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రాల్లో జీడిపిక్కలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని,ఏజెన్సీ మారు మూల గ్రామాలకు తారు రోడ్లు మంజూరు చేసి వేయాలని,మారుమూల గ్రామాలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు. చేయాలి, ఆదివాసీ రైతులకు సోలార్ ఫెన్సింగ్ మంజూరు చేయాలని,ప్రతి ఆశ్రమ పాఠశాలలో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని,ప్రతి ఆశ్రమ పాఠశాలలకు ఇద్దరేసి ఏఎన్ఎంలు భర్తీ చేయాలని,శిథిల వ్యవస్థలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను తొలగించి కొత్త అంగన్వాడి బిల్డింగులు నిర్మించాలని,ముసురుమిల్లి ప్రాజెక్టు కాలవ ద్వారా దేవారం, శరభ వరం గ్రామపంచాయతీ రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలని, చె రువులకు స్లూయిజ్లు మరియు తూములు కొత్తవి ఏర్పాటు. చేయాలని,ఏజెన్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్ కి అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని,ఐటీడీఏల ద్వారా ట్రైకార్ లోన్స్ మంజూరు చేయాలని,ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆదివాసీ పూజారులకు పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని.మొదలైన సమస్యలపై వినతి పత్రాలు అందజేశామని తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సమస్యలపై జాతీయ ఎస్టి కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గంపా నాగరాజు,కోసూరి రాజారెడ్డి,పాలిక లక్కు,సోమెల చిట్టిబాబు, బి.సింహాచలం మరియు పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *