జిల్లా వ్యాప్తంగా వున్నా కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ దోపిడీ పై డిఈఓ నిర్లక్ష్యం

ఏ.ఐ.బి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్

పయనించే సూర్యుడు న్యూస్ : కడప జూన్: 16 కడప జిల్లా వ్యాప్తంగా వున్నా కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ దోపిడీ డిఈఓ షంసుద్దీన్ నిర్లక్ష్యం చేస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని AIBSU రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ కోరారు. సోమవారం కడప కలెక్టరేట్ లో పీజీఆర్ ఎస్ ఫిర్యాదు చేశారు. డిఆర్ఓ మల్లిఖార్జునుడికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ జిల్లాలోని కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ ప్రభుత్వం ఆదేశాలను పాటించకుండా అధిక ఫీజులు, అనుమతులు లేకుండా పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు, స్కూల్స్ లోనే హాస్టల్ నిర్వహణ చేస్తున్న కూడా డిఈఓ నిర్లక్ష్యం నిర్లక్ష్యం గా వున్నారన్నారు. 2026-27 విద్యా సం. మొదలు అయినా వెంటనే జిల్లా వ్యాప్తంగా వున్నా ప్రయివేట్, కార్పొరేట్ స్కూల్స్ విద్యను సామాజిక భాద్యతతో కాకుండా, వ్యాపారంగా మార్చారన్నారు . ప్రభుత్వ నిబంధనలు ఉల్లాంఘిస్తూ నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఒక్కో విద్యార్థి నుండి సరాసరి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. దానికి మించి పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకూడదు అని ప్రభుత్వ నిభందన ఉన్న కూడా ఏ మాత్రం పాటించకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారన్నారు.విద్యార్ర్హుల తల్లిదండ్రలలను దోచుకుంటున్నారన్నారు. ఇక విద్యార్థులను జైల్లాలో వేసినట్లుగా వున్నా స్కూల్స్ లల్లోనే హాస్టల్స్ ప్రభుత్వం అనుమతి లేదు అయినా కూడా నిర్వహిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్న డిఈఓ గారు మేతక వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. వెంటనే దీని పైన విచారణ కమిటీ వేసి డిఈఓ పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *