పయనించే సూర్యుడు, జూన్ 12 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ భవన కార్మికుల సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి అనంతయ్య నివా సం దగ్గర మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని సందర్భం గా మాట్లాడుతూ బహుజనుల ఆరాధ్య దైవము భారత రాజ్యాంగ నిర్మాత డా క్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా విష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బేరి రామచం ద్ర యాదవ్ తో పాటునిర్వాహక కమిటీ సభ్యులు ఉప్పరి కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.అనంతయ్య,గంట సుదర్శన్ తెలంగాణ రాష్ట్ర బి.ఆర్.అం బేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ జయంతు ల ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్,ఓయూ విద్యార్థి లీడర్ ఎం కుమార్ అరుణ్ కుమార్ నాగరాజు, లక్ష్మీదేవిపల్లి గోవు సత్యనారాయణ యాదవ్, శ్రీనివాస్ మహేందర్ యాదవ్,తదితరులు పా ల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ నెల 13 – 06-2026 నాడు మాటు గూడెం గ్రామానికి పూడూరు మండల్ వికారా బాద్ జిల్లా సాయంత్రం నాలుగు గంట లకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందనీ, విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని కార్యక్ర మంలో పాల్గొనాలని బేరి రామచంద్ర యాదవ్ తో పాటు నిర్వాహక కమిటీ సభ్యులు కోరారు.