పయనించే సూర్యుడు జూలై 8 (గణేష్ టౌన్ రీపోర్టర్ వేములవాడ :తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్యవర్గ సమావేశం తొలి వార్షికోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని మహాలింగేశ్వర గార్డెన్లో రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులు గడ్డం నరసయ్య, అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలఅధ్యక్షులు,ఉపాధ్యక్షులు,ప్రధానకార్యదర్శులు, మున్నూరు జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య , జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి, వరాల దేవయ్య, కూర సురేష్, మీసం రాజయ్య,కాపు సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో సంఘం బలోపేతం, సామాజిక అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలు, యువత ప్రోత్సాహం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు. సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో సంఘం చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, సమాజ అభ్యున్నతికి మరింత కృషి చేయాలని తీర్మానించారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.