త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ : ఆకేపాటి

పయనించే సూర్యుడు-29-05-2026-రాజంపేట న్యూస్ : త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ అని రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. బక్రీద్ పార్వదినాన్ని పురస్కరించుకుని రాజంపేట పట్టణం పెద్ద మసీద్ మరియు బ్రాహ్మణ పల్లి ఈద్గా లో గురువారం జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలకు విచ్చేసిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి మైనారిటీ సోదరులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేట నియోజక వర్గం ఎల్లవేళలా మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఆనందోత్సాహాలమధ్య జరుపుకుంటుండడం ఆనంద దాయకంగా ఉందన్నారు. మైనారిటీల సంక్షేమానికి గత జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన ఆకాంక్షించారు. సామూహిక ప్రార్థనల అనంతరం అమర్ నాథ్ రెడ్డి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ, కరచాలనం చేస్తూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పోలా రమణారెడ్డి, డీలర్ సుబ్బరామిరెడ్డి, చొప్ప యల్లారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు జహీద్ అలీ, మసూద్, ఖజముద్దీన్, జుబేర్, ఇర్ఫాన్, మునాఫ్, జహీర్, మరియు పార్టీ నాయకులు కృష్ణారావు, వడ్డే రమణ, పాపినేని విశ్వనాథ్ రెడ్డి, సుబ్బరాజు, దండు గోపి, గొంటు మణి, సురేంద్ర, సోమ బత్తిన శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *