దుర్గమ్మ వారి ఆశీస్సులతో అధికారుల సహకారంతో సిమెంట్ రోడ్డు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి న సత్యనారాయణ గంగా మల్లయ్య

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 04 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలో ని రాయికల్ మండల పరిధిలోని మహితాపూర్ గ్రామంలో ఉన్న గన్నే ( గిరి ) గుట్ట పై న ఉన్న కనక దుర్గమ్మ గుడి వద్ద కు పోవటానికి సిమెంట్ రోడ్డు కోరారు రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు వారి నిధుల నుండి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేశారు. అట్టి నిధుల నుండి రోడ్డు వేసే సమయంలో అక్కడే ఉన్న భూ మి పట్టాదారు రాలు వంగా ముత్తవ్వ ఇట్టి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి భూమి పట్టా యజమానులు కానీ దుర్గ గుడి వద్దకు పోవటానికి రావడానికి రోడ్డు లేదని ఇక్కడి నుండి మీరు ఇక్కడ రోడ్డు పోసినట్టు అయితే నేను మా కుటుంబంలో ఉన్న అందరం కలిసికట్టుగా మీపేర్లు సూసైడ్ నోట్ రాసి మేమందరం కలిసి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పదే పదే హెచ్చరికలు చేస్తూ పోయించే రోడ్డు కు అడ్డం వచ్చి అవుతున్నా సంగతి ఇప్పటికే పలుమార్లు అపిన సంగతి తెలిసిందే. గ్రామంలో ఉన్న దుర్గమ్మ సన్నిధి కి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకొని పోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇట్టి సిమెంట్ రోడ్డు గుట్ట పైన ఉన్న దుర్గమ్మ గుడి వద్దకు పోయాలని ఉద్దేశంతో గ్రామానికి చెందిన అనుమల్ల సత్యనారాయణ బుస గంగా మల్లయ్య లు కలిసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆలోచన చేసి వారు వెంటనే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఇట్టి ఆలయానికి చెందిన రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు ధరఖాస్తు ప్రజావాణి అదికారి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు..కలెక్టర్ వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సహాయ సంచాలకులు అసిస్టెంట్ డైరెక్టర్ భూమి కొలతలు సర్వే శాఖ అధికారుల ను పిలిచి వెంటనే వారిని గ్రామానికి వెళ్లి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి భూమి కొలతలు సర్వే శాఖ జగిత్యాల జిల్లా అధికారులు మహితాపూర్ గ్రామానికి వచ్చి వారు వారి డిజిటల్ కెమెరా ఇతర డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేసి ఆలయం చుట్టూ ఉన్న భూములను చాలా దూరం నుంచి డిజిటల్ కెమెరా పరికరాల తోని అక్కడ అన్నీ భూముల ను క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు..ఇట్టి హద్దులు ఏర్పాటు చేసిన మద్య ఉన్న స్థలంలో సిమెంట్ రోడ్డు వేసుకోవాలి అని అక్కడ ఉన్న పలువురు నాయకులు గ్రామస్తుల మధ్య పట్టాదారు ల మధ్య వారు భూమి పంచనామా నిర్వహించి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రోడ్డు ను ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసి వాటికి ఎరుపురంగు వేశారు .అయినప్పటికీ భూమి పట్టాదారు రాలు వంగ ముత్తవ్వ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు అపివెయలని లేదంటే మేమంతా ఆత్మహత్య లు చేసుకుంటామని హెచ్చరించదంతో అధికారులు స్పందించి వెంటనే ఆలయం వద్ద ఉన్న రోడ్డు ను పర్యవేక్షించ డనికోరకు వచ్చి అక్కడ ఉన్న హద్దులు ఏర్పాటు చేసిన దానిని చూసి వారు ప్రభుత్వ పరంగా అన్ని కరెక్ట్ గా ఉన్నట్లు చెప్పారు..అయినా0 వినకుండా పలుమార్లు చాలా వరకు ఇబ్బంది పెట్టడం తో సత్యనారాయణ స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పలుమార్లు అధికారులకు సమస్య వివరించారు. వెంటనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ సంధ్యారాణి వారు స్థానిక పోలీసు స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు కి కలిసి సమస్య గురించి చెప్పడంతో వారు కూడా పలుమార్లు వచ్చి చూశారు. ఇట్టి ఆలయానికి సిమెంట్ రోడ్డు సమస్య పరిష్కారం గత ఆరునెలల నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇట్టి సిమెంట్ రోడ్డు కొరకు ఎన్ని ద్రష్ట శక్తులు అడ్డు వచ్చిన కానీ ఎదురు పడిన దృష్టి దృష్టా శక్తులుసమస్య లను దాటుకోంటు వచ్చి ఈ రోజు పరిష్కారం తీరి నేడు ఆలయానికి పూర్తిస్థాయిలో ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్లు అమ్మదయ ఉంటె అన్ని ఉన్నట్లు అని అమ్మ వారు తలుచుకొంటే కానిపని అంటూ ఉండదు అని అనుమల్ల సత్యనారాయణ తెలిపారు. ఇట్టి ఆలయానికి సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం సహకరించిన ప్రభుత్వ అధికారులు అందరికీ మరియు ప్రత్యేక మూగ జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ భూమి కొలతలు శాఖ అధికారులు కార్యాలయం వారికి రాయికల్ మండల తహసిల్దార్ కి అభినందనలు తెలిపారు పోలీసు శాఖ అధికారులు సహకరించిన పత్రిక మిత్రులందరికీ( విలేకరులు)అందరికీ వారు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ గన్నే రాజారెడ్డి వార్డు సభ్యులు యాదవ సంఘం అధ్యక్షులు బుస గంగా మల్లయ్య అనుమల్ల రమ భూపెళ్ళి పరమేష్ గ్రామ నాయకులు అనుమల్ల సత్యనారాయణ పాలడుగు లింగారెడ్డి (డాక్టర్ ) కర్నే గంగారెడ్డి. పెద్దిరెడ్డి సత్యనారాయణ. కొల్ల కృష్ణారెడ్డి మ్యాదరి మల్లయ్య నాగిరెడ్డి రఘుపతిరెడ్డి .తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *