పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జూన్ 7, ఆదివారం నిర్వహించనున్న శ్రీ కాటమ్మ తల్లి సంబరాల ను ఘనంగా నిర్వహించడానికి ఆటో యూనియన్ సభ్యులు నిర్ణయించారు. దైవ కార్యక్రమానికి దువ్వాడ శ్రీధర్ బాబా రూ.5,000/- ఆర్థిక సహాయంను బుధవారం ఆటో యూనియన్ సభ్యులకు అందజేశారు..ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, అమ్మవారి కృపాకటాక్షాలు పలాస ప్రజలందరిపై ఉండాలని శ్రీధర్ కోరారు. సమాజమంతా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలని, తన యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు.