పయనించే సూర్యుడు, మే23 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ గిరిజన సంక్షేమ సంఘం,నాయకులు ఏఈకీ మా తండాలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు చాలా వరకు శిథిలావస్థకు చేరి వంగిపోయి ఉన్నాయి. వర్షాకాలంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాటి స్థానంలో వెంటనే కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ ఏఈ మాధురికి తెలియజేశా మన్నారు.అలాగే కొన్ని విద్యుత్ స్తంభా లు నివాస గృహాల లోపల ఉన్నాయి. దీనివల్ల ఇంటి నిర్మాణాలకు,ప్రజలకు ఇబ్బందిగా ఉం టుందని,ఆ స్తంభాల ను తొలగించి రోడ్డు పక్కన, లైన్‌లోకి మార్చాలని మా తండా లో కొన్ని ఇండ్ల కు ఇప్పటికీ విద్యుత్ మీటర్లు లేవు.అ ర్హులైన వారికి వెంటనే కొత్త మీటర్లు మంజూరు చేసి ఇంటింటికి విద్యుత్ సరఫరా కల్పించాలని తమరు స్వయంగా పరిశీలించి,మా తండాలో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరగా వారు సానుకూలంగా స్పందించి పై సమస్య లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గిరిజన సంఘం నడిగడ్డ తాండ అధ్యక్షులు సభవత్ హన్మ నాయక్,కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, ఉపాధ్య క్షులు నాయిని రత్నకుమార్,సభ్యులు కాట్రావత్ శంకర్ నాయక్, అంగోత్ మోతిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.