నిర్మాణం పూర్తికాని కాలువ పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని విజ్ఞప్తి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 జగ్గయ్యపేట,పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ ఎదురుగా 1వ వార్డు, సిధార్థ నగర్ 1వ వీధి, బొజ్జ డెంటల్ కి వెళ్లే మార్గంలో భూపతి ఆపార్ట్మెంట్ ప్రక్కన ప్రజల సౌకర్యార్థం చేపట్టిన కాలువ నిర్మాణ పనులు ప్రస్తుతం అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాలువ తవ్వకాల మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో కాలువ నిర్మాణం ఆలస్యమవుతూ, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని సురక్షితంగా తొలగించి లేదా ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చి, నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే మురుగునీరు మరియు వర్షపు నీటి పారుదల మెరుగుపడి, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకొని పనులు వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *