పయనించే సూర్యుడు జూన్ 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పదో తరగతిలో టాప్ ర్యాంకులో పాసై నూజివీడు త్రిబుల్ ఐటీ కి అర్హత సాధించిన విద్యార్థులను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. బావి భారత పౌరులుగా ఎదగాలని మరింత ఎత్తుకు వెళ్లాలని భవిష్యత్తు బంగారు బాట కావాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రోత్సాహం ఉందన్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

కాకినాడ రూరల్ మండలం సూర్యపేట జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన ఓసిపల్లి పావని, తమవరం జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన ఐ లక్ష్మీ సాహితి, వాకలపూడి గ్రామానికి చెందిన వి వెంకట లలిత, మూడో ఏపీఎస్పీకి చెందిన పిఎం శ్రీ, నేమం జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన ఆర్ ప్రవల్లిక,, మీ వర్షిత పండూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన తన్మయి, శ్రీదేవి లు నూజివీడు త్రిబుల్ ఐటీ కి అర్హత సాధించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు పి ఈ విశ్వశాస్త్రి శ్రీనివాస్ కుమారులు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
