పయనించే సూర్యుడు జూన్ 14 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామం 1.2 అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరిని అంగన్వాడీ కేంద్రానికి పంపించవలెనని తల్లులందరికీ అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పాటుగా ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తూ వారి యొక్క పోషక ఆహారం పట్ల శ్రద్ధ వహించి అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు మంచి పోషకాహారం పంపిణీ చేయుచు ఆటపాటల ద్వారా నేర్పించి వారి యొక్క సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేస్తారని తల్లులందరికీ తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం పద్మ అంగన్వాడీ కార్యకర్తలు పి పద్మ. బి. విజయ్ కుమారి. విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు