అన్నదానం.. అద్భుత యజ్ఞం…

188 వారాలుగా హోప్ ఫౌండేషన్ సేవలు.

పయనించే సూర్యుడు జూన్ 14 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ పేదవాడి ఆకలి తీర్చడాన్ని మించిన సేవ మరొకటి లేదని, హోప్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో 188 వారాలుగా నిర్విరామంగా అన్నదాన యజ్ఞాన్ని నిర్వహించడం అద్భుతమని హోప్ ఫౌండేషన్ సభ్యు లు కొనియాడారు. చందానగర్ పరిధిలో శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఇంతమందికి అన్నం పెట్ట డం సామాన్య విషయం కాదని, నిర్వాహ కుల సేవాభావం, అంకితభావం ఎందరి కో ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసిం చారు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టి ఆదుకోవడం గొప్ప మాన వతా వాదమని పేర్కొన్నారు. వారాంత పు అన్నదానంలో భాగంగా శనివారం వేలాది మంది అన్నార్తులు తరలిరాగా, రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చినా, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగ కుండా, క్రమశిక్షణతో అందరికీ అన్నప్ర సాదం అందేలా ఫౌండేషన్ ప్రతినిధులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.ఆకలితో వచ్చిన వారి కడుపు నింపి,వారి ముఖా ల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగు తోంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఘాలి కృష్ణ, అపర్ణ, అన్నె సందీప్ హోప్ పౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *