నెట్టేకల్ గ్రామంలో వికసిత భారత్ అనే కార్యక్రమం.

పయనించే సూర్యుడు జులై 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఈరోజు ఆదోని మండలం నెట్టేకల్ గ్రామంలో నిర్వహించిన “వికసిత్ భారత్ గ్రామ జి రామ్ జి (జి ఆర్ ఏ ఎం జి)” కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గం ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం అభినందనీయమైన నిర్ణయమన్నారు.అదేవిధంగా, ఉపాధి హామీ కూలీలకు నిర్ణీత గడువులో వేతనాలు చెల్లించకపోతే, ఆలస్యమైన ప్రతి రోజుకూ పరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేయడం కార్మికుల హక్కులను పరిరక్షించే కీలక చర్య అని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, పేదల సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, ఈరన్న, రంగన్న, నాగరాజు, వీర రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *