జనంన్యూస్ జూన్ 07 ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలోని జడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న తిప్పారపు అశ్విత్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపిక అయినట్లం ఎం ఈ వో అనసూరి నరేంద్రచారి తెలిపారు . ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థికి ఒక సంవత్సరానికి 12000/- వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ వస్తుంది అన్నారు .9 వ, తరగతి నుండి 12 వ, తరగతి వరకు నాలుగు సంవత్సరాల పాటు ఈ ఆర్థిక సహాయం అందుతుంది అని ,ఈ పథకం ముఖ్యంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ,ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసమే ఈ పథకం రూపొందించబడింది అని ఎం ఈ వో తెలిపారు . ఈ పథకానికి తిప్పారపు అశ్విత్ ఎంపిక పట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాలు ఎం ఈ వో నరేంద్ర చారి ,ఉపాద్యాయులు ,గ్రామ సర్పంచ్ బాపయ్య ,ఉప సర్పంచ్ రమేష్ రావు,తల్లిదండ్రులు ,గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు