పట్టణ శివారు ప్రాంతాలను పట్టించుకోని మున్సిపల్ అధికారులు

పయనించే సూర్యుడు జూన్ 15 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని పట్టణ శివారు ప్రాంతాల అభివృద్ధిని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదోని పట్టణ పరిధిలోని పర్వతాపురం నుండి ఆదోనికి వెళ్లే రహదారిపై ఇటీవల సుమారు ఒక కిలోమీటర్ మేర మరమ్మత్తు పనులు చేపట్టారని తెలిపారు. అయితే రహదారి ఇరువైపులా గరుసు వేయకపోవడంతో వర్షాల కారణంగా రహదారి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల సొమ్ముతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రహదారి ఇరువైపులా గరుసు వేసి, వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పర్వతాపురం ఏరియా సహాయ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *