పలాసలో వైఎస్సార్‌సీపీ వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీ విజయవంతం.

* రెండేళ్లలో అభివృద్ధి సున్నా * సంక్షేమం గురించి ఊసేత్తని ప్రభుత్వం. * ప్రకటనలతోనే కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం * ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బుద్ధి చెబుతారు.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “వెన్నుపోటుకు రెండేళ్లు” ఉద్యమం పలాస నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించింది. జూన్ 4వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పలాస నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు.జూన్ 4న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మేనిఫెస్టో ప్రతులను దహనం చేయడం ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించామని, అనంతరం గ్రామాలు, వార్డులు, మండల కేంద్రాలలో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. గత వారం రోజులుగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో మహిళలు, యువత, రైతులు, కార్మికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెల్లడించారని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ రెండేళ్లు పూర్తయినా వాటిలో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయ పథకాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, రైతులకు గిట్టుబాటు ధరలు, సామాజిక భద్రత పథకాలు అన్నీ కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు.రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని, విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, ఇతర సేవల రుసుములు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పంటలకు సరైన ధరలు లేక నష్టపోతుండగా, యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కొనసాగింపు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని, వివిధ పనుల విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాకుండా రాజకీయ కక్షసాధింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ కాశీబుగ్గ వైఎస్సార్ స్క్వేర్ వరకు వేలాది మంది ప్రజలతో విజయవంతంగా సాగిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారని తెలిపారు.ఈ ఉద్యమానికి లభించిన అపూర్వ స్పందన ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన విభాగం, రైతు విభాగం, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *