పెగడపల్లిలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు.

* స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన గొప్ప సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 బోధన్ : బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం మన్యం వీరుడు,భారత స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన సాయుధ పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటం, విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల కోసం,స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప సాయుధ పోరాట యోధులు అని కొనియాడారు.యువత అల్లూరి సీతారామరాజు ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెడపల్లి మాజీ విడిసి చైర్మన్ దొనకంటి లక్ష్మారెడ్డి, పోతరెడ్డి, పద్మశాలి సంజీవ్, మేడి రవి, గణేష్ చారి, మల్లారెడ్డి, శివకుమార్, అబ్బయ్య, సతీష్, లక్ష్మణ్, సుబ్బారావు, ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *