ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు

పయనించే సూర్యుడు: మే: 22/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు, సత్తుపల్లి ,ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లి: మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణం లో సిద్దారం రోడ్డు నందు ఉన్నటువంటి ఎమ్మార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండల ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఈ రోజు ఉదయం తెలంగాణరాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , టి సి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు , సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సంబంధించిన సమస్యలను గురించి ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నేరుగా ప్రజలు వారి యొక్క సమస్యల గురించి తెలంగాణరాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండల ప్రజలు, పట్టణ వార్డు కౌన్సిలర్లు, గ్రామ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మువ్వా విజయ బాబు అభిమానులు పాల్గొని ప్రజా దర్బార్ సభను విజయవంతం చేయడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *