పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రావణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల సి డబల్యూ ఎస్ ఎన్ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ అనకాపల్లి జాయింట్ కలెక్టర్ సౌర్య మెన్ పటేల్, జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు గిడ్డి సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులు . , జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బి రామకృష్ణ గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి , పాఠశాల కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు మరియు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల విద్యా, సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే పంపిణీ చేస్తున్న ఉపకరణాల్లో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సమగ్ర శిక్ష అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు పాఠశాల విద్యార్థి మాదిరిగా యూనిఫాం ధరించి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ఒక జిల్లా స్థాయి అధికారి చూపిన ఈ నిబద్ధత, అంకితభావం విద్యాశాఖకు గర్వకారణమని అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన 436 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు సమగ్ర శిక్ష ద్వారా వివిధ రకాల సహాయక ఉపకరణాలు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ తెలిపారు. ఈ ఉపకరణాల సహాయంతో విద్యార్థులు విద్యాభ్యాసంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. “ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రతి చిన్నారికి సమాన విద్య, సమాన అవకాశం, సమాన గౌరవం అందే వరకు ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేయాలి. ప్రతి చిన్నారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి కలలను సాకారం చేయడంలో మనం భాగస్వాములు కావాలి.” జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు అని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో స్థానిక విద్యాశాఖ అధికారి కె. సింహాచలం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐవి రామిరెడ్డి ఎస్ఎంసి చైర్మన్ సత్తిబాబు సత్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ వివిధ మండలాల నుండి ఐయార్పిలు స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంపిణీ చేసిన మోటరైజ్డ్ ట్రైసైకిల్స్, వీల్‌చైర్స్, ట్రైసైకిల్స్, సీపీ చైర్స్, రోలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, టీఎల్ఎమ్ కిట్స్, బ్రెయిల్ కిట్స్ వంటి ఉపకరణాలు విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేయడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, స్వయం సమర్థులుగా ఎదగడానికి దోహదపడతాయని సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులురాములు పేర్కొన్నారు.