ప్రతి నెల ఒకటో తారీకున ప్రజల వద్దకే పింఛన్ పంచిన ఘనత కూటమి ప్రభుత్వానిది.

* రెండు సంవత్సరం సుపరిపాలన అందించిన కూటమి ప్రభుత్వం సంక్షేమ మరియు అభివృద్ధి ఒకే బాటలో ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు జూన్ 2 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోతున్న కూటమి ప్రభుత్వం, రెండు సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని రూపు కల్పన మార్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పలు గ్రామాలను కార్యకర్తలతో వీక్షించి పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప , చైర్మన్ మాట్లాడుతూ మన చంద్రన్న ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే సంకల్పంగా పనిచేసే నాయకుడు, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరం లో వితంతులకు వృద్ధులకు ఏ లోటు లేకుండా ప్రతి నెల ఒకటో తారీకు ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వడంలో సక్సెస్ అందుకుంది, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మన నాయకుడు చంద్రన్న అత్యధిక పింఛన్ పంపిణీ చేస్తున్నరు, అంతేకాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందుకు దూసుకుని పోతుంది రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ఉద్యోగాల కొరత ఉండదు, చంద్రబాబు నాయుడు తన ముందు ఆలోచనలతో అభివృద్ధి బాటలో మన రాష్ట్రం నడుస్తుంది, అంతేకాదు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు టెక్నాలజీ పరంగా అధిక పెట్టుబడులను తీసుకొని రావడంలో దృడసంకల్పంతో దూసుకుపోతున్నారు, అని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *