ప్రైవేటు వద్దు అంగన్వాడి ముద్దు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 22 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణం పరిధిలోని అంగన్వాడి కేంద్రాలు తేదీ 21-05-2026 రోజున రాయికల్ వైస్ చైర్ మెన్ తురుగ సౌజన్య శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన సిడిపిఓ జయప్రద మేడం ఆధ్వర్యంలో తల్లుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన చేస్తూ పిల్లల బరువులు పొడవులు చూసినారు సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో కి పిల్లలను పంపాలని ప్రీస్కూల్ విద్య పిల్లల భవిష్యత్తుతో పునాదిలా ఉంటుందని వారి మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని పిల్లల మేధో వికాసం మెరుగుపడడానికి అంగన్వాడీ ప్రీస్కూల్ విద్య చాలా వరకు పిల్లలను మంచి మార్గంలో నడవడానికి ఇంతగానో తోడ్పడుతుందని ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా అంగన్వాడి బోధన ఉంటుందని నర్సరీ ఎల్కేజీ. యూకేజీ. డ్రాయింగ్ పిల్లలకి నేర్పబడుతుందని గవర్నమెంట్ విద్యాబోధన టీచర్లు ట్రైనింగ్ లతో నేర్చుకుని పిల్లలకి విద్యను అందిస్తారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో విద్యా కన్నా గవర్నమెంట్ స్కూలు విద్యా చాలా పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపినారు ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఇంట్లో ఓ ఆర్ ఎస్ తప్పనిసరి వాడాలని ఉదయం 10:00 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు రావద్దని ఒకవేళ తప్పనిసరి రావాలని వచ్చినప్పుడు బయటకు వెళ్లిన సమయంలో కచ్చితంగా గొడుగును ఉపయోగించాలని నార్మల్ వాటర్ కన్నా ఓఆర్ఎస్ వాటర్ ని ఎక్కువ శాతం వాడాలని తెలియపరచినారు ఇ కార్యక్రమంలో రాయికల్ అంగన్వాడి కేంద్రాలు రాయికల్ మినీ, 01,VIII, తనిఖీ నిర్వహించడం జరిగింది రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కటకం రవీందర్ ని వైస్ చైర్మన్ తురుగా సౌజన్య ( శ్రీధర్ రెడ్డి) కమిషనర్ మనోహర్ గౌడ్ ఎంపీడీవో బింగి చిరంజీవి ని, ఎమ్మార్వో నాగార్జున ని కలవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిడిపిఓ జయప్రద మేడం సూపర్వైజర్ మమతా మేడం పద్మావతి మేడం అంగన్వాడి టీచర్లు ఆర్ సుమలత ఎస్ రాజేశ్వరి ఎం పద్మ ఆయమ్మలు రాజేశ్వరి సుభద్ర గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు ప్రీస్కూల్ పిల్లలు తల్లులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *