పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 22 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రజాస్వామ్యంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు 21 ఏళ్ల కు ఉన్న ఓటు హక్కును 18 ఏళ్ళకు తగ్గించిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేనని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రావు అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 61వ సవరణ శాసనసభ,లోక్ సభలో ఓటు వేసే వయస్సును 21 నుండి18 సంవత్సరాలకు తగ్గించేందుకు భారత రాజ్యాంగంలోని 326వ ఆదికరణ సవరణ బిల్లును 1989 మార్చి28 న ఆమోదం చేశారన్నారు. ఐటీ పితామహుడు అతిపిన్న వయసులోనే భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన గొప్ప యోధుడని కొనియాడారు. ఆధునిక భారతావనికి పునాదులు వేసి అణగారిన బతుకుల్లో వెలుగులు నింపి, తుది శ్వాస వరకు దేశం కోసమే బతికిన మహానేత భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషితో పాటు కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, కౌన్సిలర్ పల్లికొండ గంగాధర్, సర్పంచులు ప్రసాద్, భారతపు రాజేష్,పరాచ శంకర్,అంజి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, నాయకులు కోల శ్రీనివాస్, బాపురపు నర్సయ్య, తంగేళ్ల రమేష్, గన్నే రాజరెడ్డి,తలారి రాజేష్, కడకుంట్ల లక్ష్మీనారాయణ, శివ, రమేష్, బోదాసు జలపతి, కైరం స్వామి, చంద్ర తేజ, కృష్ణయ్య, నిగ భూమేష్, మధు, భూమయ్య, రెబ్బాస్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.