బాగు చేయరు ..కొత్తది నిర్మించరు!

వేలు వెచ్చిస్తే అయ్యే పనికి ఏళ్లా? అర్ధ శతాబ్ధం కిందట నిర్మించిన డ్రెయినేజీ ” పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 జగ్గయ్య పేట:పట్టణంలో మఠంబజార్లో అర్థ శతాబ్ధం క్రితం నిర్మించిన డ్రెయినేజీ నామరూపాల్లేకుండా పోయినా పురపాలక సంఘ అధికారులు, పాలక వర్గానికి పట్టటం లేదు. ఐదేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా రూ.10 వేలు నుంచి 20 వేలు ఖర్చు పెడితే తీరిపోయే డ్రెయినేజీ సమస్యపై కూడా దృష్టి పెట్టడంలేదు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అధికారులు, పాలకవర్గం గొప్పగాచెబుతున్నా ఈ చిన్న సమస్యను పరిష్కరించటంలో శ్రద్ధచూపడంలేదు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో మఠం బజార్ లో బీసీ మహిళపోలంపల్లి రాధమ్మ ఇంటి వద్ద డ్రెయిన్ను 1970లో జగ్గయ్య పేట పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించారు. కాలక్ర మేణా జనాభాపెరగటం, వీధిలో ఇళ్లు పెరిగినా ఆ డ్రెయినేజీ ఐదేళ్ల క్రితం వరకు పనిచేసింది. అప్పటి నుంచి ప్రజలు డ్రెయినేజీ దెబ్బతిందని పెరిగినప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్తది నిర్మించాలని, కనీసంమరమ్మతులు చేపట్టాలని కోరుతూవచ్చారు. చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇంత చిన్న సమస్య 10రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని రాధమ్మ చెప్పారు. కాని ఇప్పటికీ ఆ మరమ్మతులు చేయలేదని చెప్పారు. సుమారు రూ.10 వేలు ఖర్చు పెడితే సమస్య తీరి వినియోగంలోకి వస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా చైర్మన్, కమిషనర్లు స్పందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *