బాధిత కుటుంబాలకు భరోసాగా వైసీపీ నేత ముదునూరి

పయనించే సూర్యుడు న్యూస్, జూన్02 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజు సోమవారం ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, ధర్మవరం గ్రామాల్లో పర్యటించి ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒమ్మంగి గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన ఓరుగంటి సత్యనారాయణ (దొర) కుటుంబ సభ్యులను పరామర్శించిన మురళీకృష్ణంరాజు వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన అర్జంపూడి చంటిబ్బాయి భార్య వరాలమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ధర్మవరం గ్రామంలో సర్పంచ్ బెంతుకుర్తి సుశీల భర్త, వైఎస్సార్‌సీపీ నేత బెంతుకుర్తి అబ్బాయి మృతి పట్ల సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరపున అండదండలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గంటా గంగబాబు, ముమ్మిడి వీరబాబు, తోలేటి శేఖర్,గంటా లచ్చబాబు (బుజ్జి), సుంకర తమ్మారావు, గంటా చిట్టిబాబు, నార్లంక వెంకన్నబాబు, దారా నూకరాజు, మిత్తన వీరబాబు, సుంకర రాంబాబు, అర్జంపూడి రాంబాబు, వారా బాలరాజు, కోలా తాతబాబు, జువ్వల దొరబాబు, దాడి పుత్తయ్య, రాపా అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *