ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 29 మామిడిపెల్లి లక్ష్మణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,తెలుగు జాతి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను గురువారం రాయికల్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు.జగిత్యాల జిల్లా టీడీపీ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ సోమ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్ లోని తెలుగుదేశం పార్టీ జెండా గద్దె వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా సోమ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, “సామాన్య ప్రజలను, పేదలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.పటేల్, పట్వారీ వ్యవస్థను నిర్మూలించి దొరతనాన్ని ఉక్కుపాదంతో అణచివేసి, ప్రతినిత్యం ప్రజల అవసరాలు తెలుసుకుని అభివృద్ధి దిశలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్” అని కొనియాడారు.డ్వాక్రా మహిళా సంఘాలకు నాంది పలికి,మహిళలంటే ఆదిపరాశక్తి అని చాటి, మహిళలకు ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలని, ప్రతి రంగంలో ముందుండాలని మహిళలను ప్రోత్సహించిన మహాయోధుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు.అనంతరం ప్రజలకు స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ సాహెబ్ హుస్సేన్,కల్లెడ రాజరెడ్డి,బొల్లారపు రాజేశం, చింత అశోక్, ఎస్.కె. మున్వర్, మారంపెల్లి సాయిలు, సామల్ల ప్రసాద్, బైరి జనార్దన్, సిద్దాల భీమయ్య, ఆత్రం ఆనంద్, కొత్తపెల్లి హన్మాండ్లు, మహమ్మద్ సవీర్, తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *