పయనించే సూర్యుడు న్యూస్ మే 29, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధి గంజిహళ్లి గ్రామంలో గత పది రోజుల నుండి తీవ్రంగా నీటి ఎద్దడి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నీటి పంపు మరమ్మతులు చేయించడంలో జాప్యం, అక్కడక్కడ పగిలిపోయిన పైపులను మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న సంబంధిత అధికారి, ప్రతి మనిషికి నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంతవరకు, నీటితో అవసరం, అలాంటిది నీరే దొరకకపోతే మనిషి పరిస్థితి ఏంటి, గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో, ఎక్కడి సమస్యలు అక్కడే చెత్త కుప్పల పేరు పోయాయి, దర్శనామిస్తున్నాయి.పక్కనే ఉన్న హంద్రీనీవా నుండి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయకుండా, పాడైన నీటి పంపులను మరమ్మతులు చేయించకుండా, గ్రామ పంచాయతీ అధికారి గ్రామంలో నీటి కొరత సృష్టించారని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో నీరు లేక ద్విచక్ర వాహనాలు, ఆటోలలో పొలాల నుండి తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇలా ఎన్ని రోజులు ఈ అవస్థలు పడాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలక్షన్ల ముందు గ్రామానికి త్రాగునీరు, సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పిన నాయకులు, సాగునీరు దేవుని కేరుక గాని గ్రామానికి త్రాగునీరు కల్పించే దుస్థితిలో లేక కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ, పార్టీ అధికారంలో లేకున్నా నీటి సమస్య తన దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె, బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నీటి ట్యాంకర్లతో గ్రామంలో నీటి సరఫరా చేస్తుంది. అధికారంలో ఉన్న కూటమి పార్టీ నాయకులు సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు, గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న, సమస్యపై దృష్టి సారించని నాయకులు, గ్రామ అభివృద్ధికి ఇలాంటివారు తోడ్పాటు ఇవ్వగలరని,గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.అధికార పార్టీ నాయకులు గ్రామ అభివృద్ధి పై నిర్లక్ష్యం వహిస్తే,వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అసమర్థత పాలకులకు, పాలనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఇప్పటికైనా మేల్కొని సమస్యకు పరిష్కారం చూపాలని అధికార పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు. అలాగే నీటి సమస్యపై కొంతమంది గ్రామస్తులు నీటి సరఫరా కొరత ఎందుకు వచ్చిందని సంబంధిత గ్రామాధికారిని నిలదీయగా, మోటర్లు మరమ్మతులు చేయించడానికి, పంచాయతీలో ఫండ్స్ లేవని చెప్పినట్టు సమాచారం, ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్రంలో ఎగ్రామంలో కూడా వేసవిలో నీటి కొరత రాకుండా చూడాలని ఓ పక్క చెబుతున్న, నీటి సమస్య తీవ్రతరం దాల్చింది. ఈ సమస్యకు కారణం ఎవరు ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారా, సంబంధిత గ్రామ అధికారి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గంజహళ్లి గ్రామ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని గ్రామ ప్రజలు తెలిపారు.