మహానేత వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం – ఎంపీపీ పి. ఝాన్సీ సాగర్

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 08 యడ్లపాడు మండల ప్రతినిధి.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పి. ఝాన్సీ సాగర్ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ప్రజా నాయకుడిగా ఆయన గొప్పతనాన్ని చాటిందని, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, అంకితభావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. మహానేత ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పి. ఝాన్సీ సాగర్ పిలుపునిచ్చారు. ఆయన అందించిన సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *