మాయమైపోతున్నమల్లన్న గుట్టప్రభుత్వం వారి అనుమతులతో గట్టు భీమవరం దగ్గర ఉన్న మల్లన్న గుట్ట గ్రావెల్ తోలుతున్నారని ఏ ఎం ఆర్ అంటూ ఒక చిన్నపాటి చెక్పోస్టును ఏర్పాటు చేసి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వస్తే సంబంధం లేదని అని గుట్ట దగ్గర చెప్తున్నారు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 6 వాత్సవాయి మండలం భీమవరం కొంగరమల్లయ్య గట్టు మాయమైపోతున్నమల్లన్న గుట్ట ప్రభుత్వం వారి అనుమతులతో గట్టు భీమవరం దగ్గర ఉన్న మల్లన్న గుట్ట గ్రావెల్ తోలుతున్నారని ఏ ఎం ఆర్ అంటూ ఒక చిన్నపాటి చెక్పోస్టును ఏర్పాటు చేసి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వస్తే సంబంధం లేదని గుట్ట దగ్గర నుంచి వాహనాలు రోడ్డు ఎక్కినప్పుడు వారికి బిల్లు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఈ విధమైన బిల్లులు అక్రమమా సక్రమమా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఫారెస్ట్ కి సంబంధం లేకుండా ఎలా ఇస్తుంది కొంగర మల్లయ్య గట్టు వెనక గుట్టలన్ని మాయమైపోతున్నాయి మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉన్నారా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కొండలన్నీ కరిగిపోయి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ అక్రమంగా తెలంగాణకు టిప్పర్లతో వెళుతున్న గ్రావెలు రైల్వే ట్రాక్ అంటూ ఒక ట్రాక్ ని చూపిస్తూ నియోజకవర్గం స్థాయిలోఅగ్రికల్చర్ ల్యాండ్లన్నీ కూడాను లెక్కకు మించి ఎకరాల్లో రియల్ ఎస్టేట్ గా మార్చేసి ప్రతి ఒక్క వెంచర్కు వందల సంఖ్యలో ట్రిప్పులు తోలుకుంటూ అడ్డదారుల్లో గ్రావెల్ తోలుతూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయి అని స్పష్టం చేస్తున్నారు దీనిపై సంబంధిత అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తమరి జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు ఈ విధంగా ధ్వంసం అయిపోతూ ఉంటే ఎందుకని మీరు చూడట్లేదు ఆర్డీవో ఎందుకు స్పందించట్లేదు మైనింగ్ అధికారులు ఎందుకు స్పందించట్లేదు మీ ముందు నిద్ర వల్ల ప్రపంచం అలాకల్లోలం అయ్యే పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైతాయని ప్రకృతి వనరులన్నీ ధ్వంసం అయిపోవడం వలన దేశం సర్వనాశనం అయిపోతుందని ప్రజలు ఆపోతున్నారు ఇకనైనా తమరు తమ వృత్తికి ధర్మం చేస్తారని దేశానికి మేలు చేసే ఉద్యోగ ధర్మాల్లో బాధ్యతలు చేపట్టి మీరు ఇలా పట్టి పట్టనట్లుగా ఉండటం సరికాదని కొన్ని గ్రామాల నుంచి ప్రజలు హెచ్చరిస్తున్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *