పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జులై.06.2026 దేవారం గ్రామానికి వచ్చే బస్సు టైమింగ్స్ మార్పు చేయడం జరిగిందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండల పరిధిలోని దేవారం గ్రామానికి గోకవరం ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి వచ్చే బస్సు టైమింగ్స్ ఉదయం 8 గంటలకు దేవారం గ్రామం వచ్చే విధంగాను మరియు సాయంత్రం 5 గంటలకు గోకవరం ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి బస్సు బయలుదేరి విధంగాను మార్పు చేయడం చేయడం. వలన విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మరియు సామాన్య ప్రజలు బస్సు ఎక్కేందుకు అనుకూలంగా ఉంటుందని గత కొంతకాలంగా రంపచోడవరం ఐటీడీఏ పీవో వారికి, పోలవరం జిల్లా కలెక్టర్ వారికి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి వారికి, డిఆర్ఓ వారికి మొదలైన అధికారుల దృష్టికి మరియు రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఏపీఎస్ఆర్టీసీ గోకవరం డిపో మేనేజర్ స్పందిస్తూ ఈనెల 6 వ తేదీన అనగా సోమవారం ఉదయం నుండి దేవారం గ్రామానికి వచ్చే బస్సు టైమింగ్స్ ఉదయం 8 గంటలకు బస్సు వచ్చే విధంగాను మరియు సాయంత్రం 5 గంటలకు గోకవరం ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపో నుండి బస్సు బయలుదేరే విధంగాను మార్పు చేయడం జరిగిందని అధికారికంగా వ్రాతపూర్వకంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కృషి ఫలితంగానే దేవారం గ్రామానికి వచ్చే బస్సు టైమింగ్ మార్క్ చేయడం జరిగిందన్నారు. ఈ బస్ టైమింగ్స్ మార్పు చేయడానికి కృషి చేసిన అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కావున విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలుసామాన్య ప్రజలు అందరూ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు, భారత్ ఆదివాసీ పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా ప్రసార కార్యదర్శి చవలం విద్యాసాగర్ మొదలైన వారు పాల్గొన్నారు.