“మియాపూర్‌లో ప్రియుడితోకలిసి భర్తను చంపిన భార్య

పయనించే సూర్యుడు, జూలై 08 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ మియాపూర్‌లో కలకలం రేపిన మ్యాన్ మిస్సింగ్ కేసు చివరకు దారుణ హత్యగా తేలింది. వివాహేతర సంబంధం కోసమే భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని పక్క రాష్ట్రంలో పూడ్చిపెట్టిన ఉదంతాన్ని మియాపూర్ పోలీసులు ఛేదించారు.గతేడాది నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ సదరు మహిళే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగం లోకి దిగి దర్యాప్తు చేపట్టారు.నిందితు రాలి కాల్ రికార్డులు (సిడిఆర్), ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి. సాంకేతిక ఆధారాల ముందు భార్య తన తప్పును ఒప్పుకోవడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన అనంతరం, ఎవ రికీ దొరక్కుండా ఉండేందుకు మృతదే హాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాని కి తరలించి అక్కడ పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. సమా చారం అందుకున్న మియాపూర్ పోలీ సులు వెంటనే మహారాష్ట్రకు వెళ్లి, అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీ శారు.ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నా రా? అసలు ఎలా హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపు తున్నారు.అయితే,ఈ కేసుకు సంబం ధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *