ముఖ్యమంత్రి సహాయనిధితో బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

పయనించే సూర్యుడు జులై 5 రాజేష్ ) దౌల్తాబాద్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో దౌల్తాబాద్‌కు చెందిన గుండెకాయ లత, నరేష్ దంపతులకు ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎం ఆర్ ఎఫ్ ) ద్వారా మంజూరైన రూ.60,000 విలువైన చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపత్కాలంలో ఎంతో భరోసానిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పడాల రాములు, సీనియర్ నాయకుడు కర్నాల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొల్లపల్లి కనకయ్య యాదవ్.సర్పంచ్ బండారి లాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *