యూరియా తప్పని తిప్పలు రైతుల ఆందోళన.

* యాప్ తీసివేసి పాత పద్ధతిలో యూరియా అందించాలి. - నానో యూరియా లింకు పెట్టకుండా యూరియా మాత్రమే అందించాలి. - సొసైటీ గోదాం ఎదుట రైతుల నిరసన.

పయనించే సూర్యుడు న్యూస్ మే 30సాలూర : యూరియా సరఫరాలో అనేక రకాలైన అడ్డంకులను కల్పిస్తూ రైతులకు ఇబ్బందులు కల్పించడం సరికాదని సాలూర సొసైటీ పరిధిలోని రైతులు సొసైటీ గోదాం ఎదుట శుక్రవారం ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు యూరియా సరఫరా కొరకు ఆన్లైన్ యాప్ ను తీసివేసి పాత పద్ధతిలో యూరియాను సరఫరా చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఆన్లైన్ యాప్ ల ద్వారా చిన్న సన్నకారు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా యూరియా అందిస్తున్న క్రమంలో వేరే లింకులు కలుపుతూ నానో యూరియా నానో డిఏపిలను అంటకడుతూ రైతులను నిండా ముంచుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి లింకులు లేకుండా పాత పద్ధతిలో యూరియాను మాత్రమే రైతులకు అందించాలని కోరారు ఆన్లైన్ యాప్ ల ద్వారా చదువుకొని రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వాలు పునరాలోచన చేసి పాత పద్ధతిలో యూరియాను రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల కోరారు ఈ ఆందోళన కార్యక్రమంలో సొసైటీ పరిధి రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *