యూరియా నిల్వలు ముందస్తుగా ఏర్పాటు చేయాలి

పయనించే సూర్యుడు: జూన్: 16/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ముదిగొండ అంజయ్య ఈరోజు కల్లూరు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో కార్యక్రమంలో ముదిగొండ అంజయ్య మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కంపెనీ లైసెన్సులు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు కల్లూరు మండలం వ్యవసాయ అధికారి కార్యాలయం జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ నాసిరకం విత్తనాలు అత్యధికంగా రైతులకు చేరుతున్నాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . నాసిరకం విత్తనాలు సాగు చేయడం వల్ల దిగుబడులు తగ్గటంతో పాటు క్రిమి కీటకాలు బెడద పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుర్తింపు పొందిన విత్తన సంస్థలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ,పంట నష్టపోయిన రైతాంగానికి కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించాలని, ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్నల రైతులకు రెండు నెలలు గడిచిన ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత వ్యవసాయ సీజన్లో యూరియా కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావున ఈ సీజన్లో యూరియా నిలువలు అధికంగా ఉంచాలని యూరియా యాప్ ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం వ్యవసాయ శాఖ అధికారి రూపకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు సామినేని హనుమంతరావు, రైతు సంఘం నాయకులు మాదల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు తన్నీరు కృష్ణార్జునరావు, రైతులు మండేపూడి చిన్న నాసరయ్య, అల్లి రాజేష్ ,ఎస్కే హుస్సేన్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *