రాంకో కార్మికులకు సైబర్ క్రైమ్ నివారణ మీద అవగాహన కల్పించిన రూరల్ డిసిపి బి లక్ష్మీ నారాయణ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 8 జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండా గ్రామంలో గల రాంకో సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు సైబర్ నేరాల పై ఎటువంటి చర్యలు తీసుకోవాలని రూరల్ డిసిపి బి లక్ష్మీ నారాయణ అవగాహన కల్పించడం జరిగింది.సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగ ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఫోన్ లో వచ్చే కొత్త నెంబర్లు,తెలియని వాట్స్ అప్ చాటింగులు,గుర్తు తెలవని వ్యక్తులు పంపించే ఏపికె ఫైల్స్ ఓపెన్ చేయడం,పర్సనల్ అక్కౌంట్ లు,డిటేల్స్ పట్ల జాగ్రత్తలు తీసుకొని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సైబర్ నేరాల నివారణ కోసం వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు.ఈ సందర్భంగా రాంకో సిమెంట్ కంపెనీ విపి ఫరూక్ మాట్లాడుతూ అనవసరమైన ఫోన్స్, మెసేజ్ లు వల్ల కార్మికులు మోసపోవద్దని, ఏదైన సైబర్ పొరపాటు జరిగితే పోలీసులను సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు, యస్ఐ సూర్య శ్రీనివాస్, మణికంఠ, పోలీసు సిబ్బంది, రాంకో సిబ్బంది పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *